- రావులపాలెం రూరల్ సిఐ విద్యాసాగర్
తల్లిదండ్రులు మందలించారని అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆరుగురు విద్యార్థుల జాడను పోలీసులు 24 గంటలు గడవకుండానే తెలుసుకున్నారు. ఆలమూరు ఖండ్రిగ పేటకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఈనెల 24వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోగా శుక్రవారం తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీ మోహన్ పర్యవేక్షణలో రావులపాలెం రూరల్ సిఐ విద్యాసాగర్, ఎస్సై అశోక్ గాలింపు చర్యలు చేపట్టారు. సిఐ విద్యాసాగర్ బృందం బాలలను గుర్తించి ఆలమూరు తీసుకుని వస్తున్నారు. విద్యార్థుల జాడ కనుక్కోవడానికి కృషి చేసిన మీడియాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Share this content:
Post Comment