తిరుపతి, నియోజకవర్గంలోని ఇద్దరికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అందించారు. మంగళవారం తన నివాసంలో లబ్ధిదారులకు చెక్కులను ఆయన పంపిణీ చేశారు. 42వ డివిజన్ పరిధిలోని శాంతినగర్ కు చెందిన సత్యనారాయణకు మూడు లక్షల యాభై మూడు వేల రూపాయల చెక్కును, 9వ డివిజన్ పరిధిలోని సంజయ్ గాంధీ కాలనీకి చెందిన మునిబాలకు చెందిన చెక్కులను ఎమ్మెల్యే అందించారు. అనారోగ్యంపాలై ఆస్పత్రి ఖర్చులకు ఇబ్బంది పడుతున్న వారికి కుటుంబంలో పెద్దకొడుకుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదలకు సిఎం సహాయనిధి నుంచి ఆర్థిక సాయం అందిస్తుండటం నిజంగా వరమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు రాజా రెడ్డి, మహేష్ యాదవ్, సుమన్ బాబు, లోకేష్, మధుబాబు, శిరీష, కిషోర్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment