ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఇఫ్తార్ విందు

తిరుపతిలోని షాది మహాల్‌లో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించిన అనంతరం, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన రంజాన్ పవిత్రతను వివరిస్తూ, ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లింల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. మత, కుల భేదాలు లేకుండా అందరూ ఐక్యంగా ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. గత ఎన్నికల్లో ముస్లిం సోదరులు ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలిచి విజయానికి తోడ్పడ్డారని, వారికి జీవితాంతం రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. ముస్లిం సోదరులకు ఏ చిన్న సమస్య వచ్చినా కూటమి ప్రభుత్వం తరఫున అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి పార్టీల మైనారిటీ నాయకులు, జనసేన, టీడీపీ పార్టీల ప్రముఖులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-03-28-at-8.44.03-PM-3-1024x682 ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఇఫ్తార్ విందు

Share this content:

Post Comment