ఆరోగ్య మౌలిక వసతుల విస్తరణకు ఎమ్మెల్యే బత్తుల విజ్ఞప్తి

*రాజానగరం నియోజకవర్గానికి 6 అదనపు 108 ఆంబులెన్స్‌లు మంజూరు చేయాలి
*సీతానగరం మండలం బొబ్బిల్లంక గ్రామంలో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని త్వరగా పూర్తిచేయాలి
*రఘుదేవపురం గ్రామంలో 30 పడకల సామూహిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలి
*బూరుగుపూడి గ్రామంలో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రి ఏర్పాటు చేయాలి
*రాజానగరం మరియు కొరుకొండలో ఉన్నపి హెచ్ సి లను 30 పడకల సీ హెచ్ సి లుగా అప్‌గ్రేడ్ చేయాలి
*ఎమ్మెల్యే బత్తుల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు ఐఏఎస్‌ను అమరావతిలో సోమవారం కలుసుకున్న రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, తన నియోజకవర్గంలోని వైద్య సేవల పరిస్థితిని వివరించి, ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు అనేక కీలక అభ్యర్థనలు సమర్పించారు. ఇందులో ముఖ్యంగా శ్రీకృష్ణపట్నం మరియు గాదరాడ గ్రామాల్లో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పి హెచ్ సి) ఏర్పాటు చేయాలని, రాజానగరం నియోజకవర్గానికి అదనంగా ఆరు 108 ఆంబులెన్స్‌లు మంజూరు చేయాలని కోరారు. అలాగే సీతానగరం మండలంలోని బొబ్బిల్లంక గ్రామంలో నిర్మాణంలో ఉన్న పి హెచ్ సిభవనానికి నిధులు విడుదల చేయాలని, రఘుదేవపురం గ్రామంలో 30 పడకల సామూహిక ఆరోగ్య కేంద్రాన్ని (సీ హెచ్ సి ) ఏర్పాటు చేయాలని, బూరుగుపూడి గ్రామంలో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని స్థాపించాలని, రాజానగరం మరియు కొరుకొండలో ఉన్న పి హెచ్ సి లను 30 పడకల సీ హెచ్ సి లుగా అప్‌గ్రేడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రజలు ప్రాథమిక వైద్య సేవలకు దూరంగా ఉండటం, అత్యవసర వైద్య రవాణా కొరత, ప్రసవాలు, ప్రమాదాలు వంటి సందర్భాల్లో ఎదురయ్యే ఇబ్బందులను వివరించిన ఎమ్మెల్యే, త్వరితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ఈ విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన ఎం.టి. కృష్ణబాబు ఐఏఎస్, వీలైనంత త్వరగా అనుమతులు మంజూరు చేసి నిర్మాణాలు ప్రారంభించి ప్రజలకు సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Share this content:

Post Comment