రాజానగరం నియోజకవర్గంలోని సీతానగరం మండలం సింగవరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న రామాలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) శ్రీవాణి ట్రస్ట్ నుంచి మంజూరైన రూ.3,01,627 విలువైన చెక్కును ఆలయ కమిటీకి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అందజేశారు. ఈ కార్యక్రమం గ్రామ కూటమి నాయకుల సమక్షంలో నిర్వహించబడింది. చెక్కు అందజేసే కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై సంప్రదాయపూర్వకంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
Share this content:
Post Comment