తొర్రిగడ్డ ఎత్తిపోతల పధకం పరిశీలించిన ఎమ్మెల్యే బత్తుల

*గత వైసిపి పాలకుల విధ్వంసం..రైతులకు శాపం
*ఎత్తిపోతల పధకం మరమ్మత్తులు త్వరితగతిన పూర్తిచేయాలి
*ప్రతీ సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఒక వారం ముందుగానే సాగునీరు

సీతానగరం మండలంలో గల తొర్రిగడ్డ ఎత్తిపోతల పధకం సందర్శించి రైతులకు సాగునీరు అందించేందుకు ఇబ్బందులు లేకుండా కాలువ పూడిక పనులు తక్షణమే ప్రారంభించాలని అధికారులను ఆదేశించిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ. ప్రతీ సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఒక వారం ముందుగానే సాగునీరు అందించాలని ఆదేశించారు. ఎత్తిపోతల పధకం మరమ్మత్తులు త్వరితగతిన పూర్తిచేయాలని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నిత్యం అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు దూసుకువెళ్తుంది.. గత వైసీపీ పాలనలో గడచిన ఐదేళ్లలో విధ్వంస పాలనలో భాగంగా రైతులకు సాగునీరు అందించడంలో విఫలమవ్వడం మనం చూసాం.. ఎత్తిపోతల పథకాల మరమ్మత్తులు గానీ, కాలువలు పూడిక తీయించడం గాని చేయకుండా రైతులను అన్ని విధాలుగా నష్టపరచిన పరిస్థితులు గత ప్రభుత్వంలో మనం చూసాం. ప్రస్తుతం తాత్కాలిక మరమ్మత్తులు చేయాల్సిన అవసరం ఉంది..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండటం వలన ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క పనిని ట్రాక్ ఎక్కిస్తున్నారు..త్వరలోనే ఈ ఎత్తిపోతల పధకాలు పూర్తి స్థాయిలో మరమ్మత్తులు చేసి, మోటార్లు రీప్లేస్ చేసి, పైప్ లైన్ లు రీప్లేస్ చేసి, కాలువలు అన్ని పూర్తి స్థాయిలో పూడికలు తీసి, రిటైనింగ్ వాల్ నిర్మించేలా ప్రయత్నాలు చేస్తుంది ప్రభుత్వం. త్వరలో ఎత్తిపోతల పథకాలన్నింటినీ కాంట్రాక్టుకు ఇచ్చి అన్ని పనులు పూర్తి చేయాలనీ ఇరిగేషన్ శాఖ ప్రణాళికలు రూపొందించుకుంది. రైతులకు సాగునీరు ఇబ్బంది లేకుండా ఉండేందుకు పరిస్థితులు అన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ప్రస్తుతం ఆర్ధిక సమస్యలు ఉన్నందున తాత్కాలిక మరమ్మత్తులు చేయాలని కూటమి నాయకులు అందరూ కలిసి ఒక మాట మీదకు రావడం జరిగింది.. రైతులకు ఈ సంవత్సరం రెండు పంటలకు ఇబ్బందులు లేకుండా పూడికలు తీసేలా చైర్మన్ శ్రీను, వైస్ చైర్మన్ రాజు, కూటమి నేతలు అందరూ కలిసి కాలువలు పూడికలు తీయించి రైతులకు సాగునీరు విషయంలో ఇబ్బంది లేకుండా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-06-16-at-2.26.51-PM-1-1024x682 తొర్రిగడ్డ ఎత్తిపోతల పధకం పరిశీలించిన ఎమ్మెల్యే బత్తుల

Share this content:

Post Comment