*శ్రీ లక్ష్మీనరసింహ కోరుకొండ ప్రెస్ క్లబ్ వారికి లక్ష రూపాయలు విరాళం అందించిన బత్తుల
*కత్తి కన్నా కలం గొప్పది
*రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ
రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చేతులమీదుగా జూన్ నెలలో శ్రీ లక్ష్మీనరసింహ కోరుకొండ ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం జరిగింది. ఆరోజు ప్రెస్ క్లబ్ కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసుకునేందుకు బలరామకృష్ణ తన వంతు సాయంగా లక్ష రూపాయలు విరాళం ఇస్తానని ప్రకటించారు, దాని నిమిత్తం సోమవారం లక్ష రూపాయల మొత్తమును ఎమ్మెల్యే నా ద్వారా పంపించారని జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు స్టేట్ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ప్రెస్ మీట్ ద్వారా తెలిపారు. అనంతరం లక్ష రూపాయల మొత్తాన్ని శ్రీ లక్ష్మీనరసింహ కోరుకొండ ప్రెస్ క్లబ్ వారికి అందజేశారు. ఈ సందర్భంగా, బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ, కత్తి కన్నా కలం గొప్పదన్న నానుడి ప్రకారం కోరుకొండ, సీతానగరం, రాజానగరం, మూడు మండలాల మీడియా సోదరులు పనిచేస్తున్నారని మీడియా సోదరులను కొనియాడారు. ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజలకు ఉన్నది ఉన్నట్టుగా తెలియజేయడంలో ఎప్పుడు ముందుంటారు అని అనడంలో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. ఎందుకంటే మేము రాజకీయాల్లో రాకముందు నుంచి కూడా మేము చేసే వివిధ సేవా మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్భయంగా ప్రజలకు తెలియజేశారని, మీడియా సోదరుల సేవలను మరోసారి గుర్తు చేసుకున్నారు. మీకంటూ ప్రత్యేక ఆదాయం లేనప్పటికీ, మీ ఫ్యామిలీని కూడా పక్కనపెట్టి మీరు అందించే సేవలు వర్ణనాతీతం అన్నారు. రాబోయే రోజుల్లో మీరు అందించే సేవలు ప్రజలకు మరింత చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అని అన్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని బేధాలు లేకుండా, మీరంతా ప్రజల వైపు ఉండాలని పేర్కొన్నారు. మీడియా సోదరులంతా ప్రజల తరపు పోరాడి, పార్టీలకు అతీతంగా పనిచేసి, ఎవరు ఏ తప్పు చేసినా సరే చేసినా సరే, ధైర్యంగా తెలిపే శక్తి మీకు ఉందని, అందుకు అనుగుణంగా అందరూ పని చేయాలని మరోసారి మీడియా సోదరులకు తెలియజేశారు. ముఖ్యంగా, మీరు శాశ్వత ప్రెస్ క్లబ్ ను నిర్మించుకునేందుకు మరియు మీడియా సోదరులందరికీ ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు మన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు కంకణం కట్టుకున్నారని ఈ సందర్భంగా బత్తుల వెంకటలక్ష్మి తెలియజేశారు.
ఈ ప్రెస్ మీట్ లో మీడియా సోదరులతో పాటు ఎన్డిఏ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment