*రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం
ఒడిశలేరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రాజానగరం మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన రేలంగి శివన్నారాయణ కుటుంబాన్ని పరామర్శిస్తూ, జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మరియు నేత శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మానవత్వం చాటారు. ప్రమాద ఘటన తెలిసిన వెంటనే విజయవాడ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి హుటాహుటిన చేరి, సంబంధిత అధికారులతో మాట్లాడి, పోస్టుమార్టం, అంత్యక్రియల ఏర్పాట్లను వేగవంతం చేయడంలో సత్వర చర్యలు చేపట్టారు. నేడు మరొకసారి బాధిత కుటుంబాన్ని స్వయంగా పరామర్శించి, మృతులకు నివాళులు అర్పించి, ఆ కుటుంబంలో జీవించివున్న ఇద్దరు చిన్నారులకు ఒక్కొక్కరికి లక్ష చొప్పున రెండు లక్షల రూపాయలు వ్యక్తిగత సాయంగా అందించారు. ఈ సందర్భంగా బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ, ప్రభుత్వం తరఫున రావలసిన ఐదు లక్షల నష్టపరిహారాన్ని త్వరితగతిన అందించేలా కృషి చేస్తామన్నారు. పిల్లల విద్యాభవిష్యత్తుకు పూర్తి భరోసా ఇస్తామన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ శ్రేణులు, గ్రామస్థులు పాల్గొన్నారు. ఈ సంఘటనలో బత్తుల దంపతుల మానవతా స్పందన, గ్రామస్థుల హృదయాలను హత్తుకుంది.
Share this content:
Post Comment