సీతపల్లి వాగు ఘటనలో మృతులకు అండగా ఎమ్మెల్యే బత్తుల

*సీతపల్లి వాగు ఘటనలో యువకుల మృతి అత్యంత బాధాకరం
*అన్ని విధాలుగా వారి కుటుంబసభ్యులకు అండగా ఉంటాం..
*ఎమ్మెల్యే సొంత నిధులు నుండి కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున రెండు లక్షలు ఆర్ధిక సహాయం అందజేత

కొరుకొండ మండలం కోటికేశవరం గ్రామానికి చెందిన యువకులు పీతల రాకేష్ (21), మంచం హర్ష సీతపల్లి వాగులో స్నానం చేస్తుండగా దురదృష్టవశాత్తు గల్లంతై మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ హుటాహుటిన రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతదేహాలపై పోస్ట్‌మార్టం పూర్తయిన తర్వాత కుటుంబసభ్యులకు అప్పగించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, యువకుల మృతి హృదయ విదారకమని, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న బాధను తాము పంచుకుంటామని తెలిపారు. ఆ కుటుంబాలకు తగిన మద్దతుగా తన సొంత నిధుల నుండి ఒక్కో కుటుంబానికి రూ.1,00,000 చొప్పున మొత్తం రూ.2,00,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని, బాధిత కుటుంబాలకు మద్దతుగా నిలిచారు.

Share this content:

Post Comment