తాడేపల్లిగూడెం, ఆపత్కాలంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం 15వ వార్డు సవిత్ర పేటకు చెందిన సమయం జయవిష్ణు బ్రెయిన్ ఆపరేషన్ నిమిత్తం వారి కుటుంబ సభ్యులు 15 రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యేని కలవగా సీఎం సహాయనిధి నుండి రెండున్నర లక్షల (2,50,000) రూపాయల విలువైన ఎల్ఓసిని మంజూరు చేయించారు. ఈ మేరకు ఆదివారం తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాధితుని తండ్రికి బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదగా
“ఎల్ ఓ సి” అనుమతి పత్రంను అందజేశారు. ఈ సందర్భంగా ఎల్ఓసి ని మంజూరు చేయించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కి, వార్డు ఇంచార్జ్ అడబాల రామారావు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రామారావు, వర్తనపల్లి కాశి, అడపా ప్రసాద్, పుల్లా బాబి, పాలూరు వెంకటేశ్వరరావు, బైనపాలేపు ముఖేష్, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, గుండుమొగుల సురేష్, అడబాల నారాయణమూర్తి, మద్దాల మణికుమార్, అడబాల మురళి,అడ్డగర్ల సూరి, యాంట్రపాటి రాజు, చాపల రమేష్, గట్టిం నాని, కామిశెట్టి శ్రీను, కాజులూరి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment