నరసాపురం నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు నరసాపురం శాసన సభ్యులు బొమ్మిడి నాయకర్ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన ఆర్థిక సహాయ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. లబ్ధిదారులు & చెక్కు వివరాలు: సుందర రామకృష్ణ (నిటితిప్ప గ్రామం) – ₹ 1,75,895, లక్కు నాగలక్ష్మి (రామన్నపాలెం – లక్కు వారి తోట) – ₹ 20,000, గొల్లమందల చరిత (కొప్పరు గ్రామం) – ₹ 30,786. ఈ సందర్భంగా బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ, ఈ నిధులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఎంతో ఉపయోగపడతాయని, కష్టకాలంలో ప్రభుత్వం ప్రజలతో పాటు నిలబడి సహాయం అందిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆకన చంద్రశేఖర్, కొల్లాటి గోపికృష్ణ, బందేల రవీంద్ర, గుబ్బల మారాజు, బందేలా ఎలేష
కటకం శెట్టి సంజీవరావు, పోలిశెట్టి గణేశ్వర రావు, వడ్డి ఆదినారాయణ, ఇది కాకుండా నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Share this content:
Post Comment