శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ప్రత్యేక పూజలు

సింగపూర్ టొమాటో స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు కొణిదల మార్క్ శంకర్ బాబు వారితో పాటు మిగిలిన 18 మంది చిన్నారులు త్వరగా కోలుకోవాలని ప్రభుత్వ విప్ మరియు నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో బుధవారం భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి చి|| మార్క్ శంకర్ పేరు మీద ప్రత్యేకంగా అభిషేకాలు అర్చనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయకర్ మాట్లాడుతూ ఎప్పుడూ దేశం బాగుండాలని, సమాజం బాగుండాలని పదిమంది మంచి కోరే పవన్ కళ్యాణ్ గారి ఇంట ఇలా జరగటం బాధాకరమన్నారు. కష్టాల్లో ఉన్నవారిని సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న వారిని ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండే మెగా ఫ్యామిలీ లో ఇలాంటి ప్రమాదం జరగడం పట్ల రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఆవేదన ఆందోళన చెందుతున్నారు. మన రాష్ట్ర డిప్యూటీ సీఎం కు ఆయన కుటుంబ సభ్యులకు ఆ దేవదేవుడు భగవంతుడు ఎప్పుడూ అండగా ఉంటాడని వారికి అంతా మంచే జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు.. గతంలో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేని సమయంలో వారికి అన్నం పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఆదుకొని వారికి అండగా నిలబడ్డారని, ఆ మంచితనమే ఇప్పుడు ఆయన బిడ్డను సింగపూర్ అగ్ని ప్రమాదంలో భవన నిర్మాణ కార్మికులు కాపాడడానికి కారణమైందని ఆయన గుర్తు చేశారు. ప్రమాదంలో గాయపడ్డ చి|| మార్క్ శంకర్ కు ఆ ఆంజనేయస్వామి స్వామి వారి కృపతో పాటు రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంగా మన ముందుకు తిరిగి రావాలని ఆయన అభిలాషించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొమ్మిడి సునీల్, కోటిపల్లి వెంకటేశ్వరరావు, వలవల నాని, కోపల్లి శ్రీనివాస్, చెన్నంశెట్టి నాగు, పిల్లా శ్రీహరి, పోలిశెట్టి సాంబా, గుగ్గిలపు శివరామకృష్ణ, అడ్డాల బాబీ, యాతం మహేష్ పొన్నమండ యుగంధర్ మరియు నియోజకవర్గ జనసేన టిడిపి బిజెపి నాయకులు జనసైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment