ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలోని ఎంపిడిఓ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ సమావేశంలో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పాల్గొని అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించి వివరాలను తెలుసుకున్నారు. పెండింగ్ బిల్లులు లేదా ఎస్టిమేషన్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎన్.డి.ఏ కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అందరూ గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గంజి మాల రామారావు, తాసిల్దార్, ఎంపీడీవో, జడ్పీటీసీలు, ఎంపీపీ, సర్పంచులు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Share this content:
Post Comment