ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు

ఏలూరు జిల్లా, గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల-జీలుగుమిల్లి మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం పాఠశాలకు విచ్చేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఎన్నికల ప్రచారం మరియు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉపాధ్యాయులకు జీవో నెంబర్ 3 అనేది గుండెకాయలాంటిది, దానిని పునరుద్ధరించాలని ఉపాధ్యాయులు ఎమ్మెల్యేని కోరారు, దానికి స్పందనగా ఎలక్షన్ అయిన వెంటనే జీవో నెంబర్ 3 పట్ల దృష్టి సారించి సీఎంకి తెలిపి పునరుద్ధరిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్.డి.ఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment