మార్చి 14వ తారీఖున జరగబోయే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన కాకినాడలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు హాజరై, వేడుకల నిర్వహణపై పలు సూచనలు ఇచ్చారు. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయడంలో నాయకులు, కార్యకర్తలు సమష్టిగా శ్రమించాలని ఆయన కోరారు.సభ కోసం అవసరమైన ఏర్పాట్లు, ప్రజల రాకపోకలకు అనుకూలంగా రవాణా సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై సమావేశంలో చర్చ జరిగింది. మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఈ వేడుకలు ఘనంగా నిర్వహించాలని సూచించగా, అన్ని శాఖల సమన్వయంతో వేడుకలను విజయవంతం చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this content:
Post Comment