సి.ఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు

పోలవరం శాసనసభ్యులు సిఫార్సు మేరకు లబ్ధిదారులకు సుమారు రూపాయలు 12,05,0000/- ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు మంజూరు చేయడం జరిగింది. జనసేన పార్టీ మండల అధ్యక్షుల సమక్షంలో లబ్ధిదారులకు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చెక్కులందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదములు తెలిపారు. మా సిఫారసు మేరకు బడుగు బలహీన, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చేయూత గా ఇప్పటివరకు మా నియోజకవర్గంలో సుమారు 70 చెక్కులు అందించడం జరిగిందని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చిర్రి బాలరాజు అన్నారు.

WhatsApp-Image-2025-03-06-at-2.07.47-PM-1024x576 సి.ఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు

Share this content:

Post Comment