ఏలూరు జిల్లా, సత్యవోలు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ అత్త ఘంటా ప్రసాద్ రావు మరియు తల్లి అచ్చుమాంబ అకాల మరణం చెందడం దురదృష్టకరం. ఈ నేపథ్యంలో, పోలవరం శాసన సభ్యులు చిర్రి బాలరాజు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, అమ్మ అచ్చుమాంబ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు దుగ్గిన శ్రీను, కుమార్, జీలుగుమిల్లి మండల నాయకులు కూరం వెంకటేశ్వరరావు, డేవిడ్ రాజు, అలాగే ఎన్.డి.ఏ కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this content:
Post Comment