రాజోలు, సఖినేటిపల్లి మండలం మోరిపోడు గ్రామంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ముప్పర్తి సుబ్బారావుకి సంబంధించిన ఫ్యాక్టరీలో జీడిపప్పు మొత్తం కాలిపోవడం జరిగింది. గురువారం ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆ ఫ్యాక్టరీని సందర్శించి తదుపరి కాలిపోయిన జీడిపప్పును పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్ కు గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్రేకర్ ఫెయిల్యూర్ వల్ల ఇబ్బంది వచ్చింది అని మరోసారి ఇలా జరగదు అని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీడిపప్పు తయారీ విధానాన్ని స్వయంగా పరిశీలించారు. తయారీ ఏ విధంగా జరుగుతుందో స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మీకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి కుటీర పరిశ్రమలుగా ఇవి వృద్ధి చెందడానికి నా వంతు కృషి చేస్తానని తెలిపారు. ఇకపై ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటానని, మిగిలిన వారివి కూడా కొన్ని మోటార్లు కాలిపోయాయి అని నా దృష్టికి వచ్చింది అని తెలిపారు. ఎన్డీఏ కూటమి నాయకులు వారి వెంట పాల్గొన్నారు.
Share this content:
Post Comment