రాజోలు, మామిడికుదురు మండలం, గోగన్నమఠం – పల్లిపాలెం గ్రామంలో మంగళవారం ఉదయం ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో పట్టా అదియ్యకు చెందిన తాటాకు ఇళ్ళు పూర్తిగా దగ్ధం అయ్యింది. ప్రమాద సంఘటన స్థలాన్ని శాసనసభ్యులు దేవ వరప్రసాద్ నేడు పరిశీలించారు. జరిగిన నష్టాన్ని స్వయంగా బాధితులను అడిగి తెలుసుకున్నారు. బాధితులు మాట్లాడుతూ కట్టుబట్టలతో సహా సర్వం కోల్పోయామని మీరే మాకు అండగా ఉండాలని చేపలు అమ్ముకొంటూ జీవనం సాగిస్తున్నామని ఈ ప్రమాదాన్ని ఊహించలేదు అని వాపోయారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని మీకు కావాల్సిన నిత్యావసరాలు, బట్టలు, భోజన సదుపాయాలను స్థానిక ఎన్డీఏ నాయకులు సమకూరుస్తారని తెలిపారు. స్థానిక నాయకులు సమకూర్చిన ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే బాధిత కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, గోగన్నమఠం గ్రామస్తులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment