మేడే వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే దేవ వరప్రసాద్

రాజోలు మండలం రాజోలు లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసన సభ్యులు దేవ వరప్రసాద్. ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన ఈ మేడే వేడుకలలో పాల్గొనడం నాకు ఆనందంగా ఉందని ఆర్టీసీ కార్మికులు ఏ సమస్య ఉన్న నేను అండగా ఉంటానని తెలిపారు. రాజోలు నియోజకవర్గం లో మరిన్ని ఆర్టీసీ సర్వీసు లు పెంచాలి అని ఆర్టీసీ డిపో మేనేజర్ కి తెలియచేశారు. రాజోలు ఆర్టీసీ డిపో మేనేజర్ మాట్లాడుతూ అంతర్వేది రూట్ సర్వీస్ అంటే మా ఆర్టీసీ ఉద్యోగులు ఇబ్బంది పడేవారని కానీ నేడు అద్భుతమైన రోడ్డు నిర్మాణం చేయడం చాల సంతోషం అని ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలియజేశారు. తదుపరి శ్రీ కుంతలేశ్వరి అమ్మవారి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మేడే వేడుకలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు,యూనియన్ నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment