కేశనపల్లి గ్రామం మరియు పరిసర ప్రాంతాలలో డ్రైన్ ముంపు వలన తీవ్రంగా నష్టపోయిన కొబ్బరి పొలాలను మంగళవారం గౌరవ శాసన సభ్యులు దేవ వరప్రసాద్ ఇరిగేషన్ ఇంజనీర్లు ( సూపరిడెంట్ ఇంజనీర్/ చీఫ్ ఇంజనీర్) లతో కలిసి పరిశీలించారు. తదుపరి తుపాను ఆశ్రయ భవనం నందు నిర్వహించిన సమావేశంలో కేశనపల్లి మరియు పరిసర గ్రామాల ప్రజలు మాట్లాడుతూ డ్రైనేజీ ముంపు వలన మా ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది అని ఆ దెబ్బతిన్న కొబ్బరి చెట్లను చూస్తే మా కంట కన్నీరు వస్తుందని వాపోయారు. గత ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లిన ప్రయోజనం శూన్యం అని మాకు మీరే పరిష్కారం చూపాలని ముంపుకి గురి అవుతున్న శంకరగుప్తం డ్రైన్ పొడవున ఇరువైపుల గట్టు నిర్మించి మాకు ఈ సమస్య నుండి విముక్తి కల్పించాలి అని కోరారు. తదుపరి ఇరిగేషన్ ఇంజనీర్లు మాట్లాడుతూ సమస్య తీవ్రత ఎక్కువ ఉందని శాసన సభ్యులు దేవ వరప్రసాద్ గారి ఆదేశాలు మేరకు త్వరలో ఈ సమస్యకి పరిష్కారం చూపుతాం అని తెలిపారు. ఈ సందర్భంగా గౌరవ శాసన సభ్యులు దేవ వరప్రసాద్ మాట్లాడుతూ మీ సమస్య నా దృష్టిలో చాల కాలం నుండి ఉందని నేడు ఈ సమస్యరింత జటిలం అయ్యింది అని అన్నారు. దాదాపు లక్ష కొబ్బరి చెట్లు ఈ ముంపు వల్ల దెబ్బతిన్నాయని రైతు తన ఆదాయాన్ని కోల్పోయాడని తెలిపారు. తలలు తెగి మోడులుగా మిగిలిన కొబ్బరి చెట్లను చూస్తే చాలా బాధ ఉందని వాపోయారు. కొబ్బరి చెట్ల కు మాత్రమే నష్టం కలగలేదని భూగర్భ జలాలు కూడా పూర్తిగా కలుషితం అయ్యాయి అని కనీసం వాడకానికి కూడా ఈ నీరు పనిచేయడం లేదని తెలిపారు. మలికిపురం మండలం తో పాటు సఖినేటిపల్లి మండలంలో ఇంకా ఎక్కువ శాతం కొబ్బరి చెట్లు పంట పొలాలు నష్టపోయాయి అని క్రాప్ హాలిడే ఇచ్చే పరిస్థితి ఆ మండలంలో నెలకొందని తెలిపారు.
పూర్తి స్థాయిలో ఈ సమస్యకి పరిష్కారం కోసం కృషి చేస్తానని ఇరిగేషన్ మంత్రి గారితో మాట్లాడడం జరిగిందని సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఇరిగేషన్ ఇంజనీర్లు కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అని అందుకే జిల్లా స్థాయి అధికారులు ను క్షేత్ర స్థాయి పరిశీలనకు పిలిపించానని తెలిపారు. త్వరలో ఈ సమస్యకు ముగింపు పలికి మళ్లీ పూర్వ వైభవం వచ్చే వరకు నేను కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్, ఇరిగేషన్ ఇంజనీర్లు, కేశనపల్లి మరియు పరిసర గ్రామాల ప్రజలు, రైతులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment