- ఎన్డీఏ కూటమి మహిళా నేతలతో శాసనసభ్యులు దేవ వరప్రసాద్ సమావేశం
రాజోలు, మలికిపురం మండలం, విశ్వేశ్వరాయపురం శాసనసభ్యుల వారి క్యాంపు కార్యాలయం నందు ఎన్డీఏ కూటమి మహిళా నేతలతో శాసన సభ్యులు దేవ వరప్రసాద్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ మహిళలు రాజకీయాల్లో కీలకపాత్ర వహించాలి అని వారికి సముచితమైన స్థానాన్ని ఎన్డీఏ కూటమి కల్పిస్తుంది అని తెలిపారు. మహిళా ఉపాధి అవకాశాల కల్పనపై తాను ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నానని తద్వారా ప్రతి మహిళ స్వయం ఉపాధి పొంది తన కాళ్లపై తను నిలబడే విధంగా కుటుంబ వ్యవస్థలో ముఖ్య భూమిక వహించే విధంగా తయారు కావాలని ఆకాంక్షించారు. ఎన్డీఏ కూటమి మహిళ నేతలు అందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడాలని తెలిపారు. ఈ సమావేశంలో మహిళా నేతలు కూడా తమ తమ అభిప్రాయాలు శాసనసభ్యులు వారికి తెలియజేశారు. అనంతరం పి.ఎం.ఏ.జె.ఏ.వై పథకం ద్వారా 13 మంది ఎస్సీ – డ్వాక్రా మహిళలకు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సహకార ఆర్ధిక సంస్థ ద్వారా మంజూరైన రాయితీతో కూడిన చెక్కులను శాసన సభ్యులు దేవ వరప్రసాద్ వారి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందచేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి కావాలని వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడే విధంగా ఈ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు. ప్రతి మహిళ ఆర్థికంగా సామాజికంగా ముందుండాలని దానికి తగిన విధంగా రాజోలు నియోజకవర్గం లో మహిళల ఉపాధి కొరకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, డ్వాక్రా ఉద్యోగులు, వీర మహిళలు, తెలుగు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment