పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ధర్మరాజు

ఉంగుటూరు, శనివారం భీమడోలు మండలం పోలసానిపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలలో ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలలో భాగంగా పంచాయతీ నిధులతో నిర్మించిన అంతర్గత గ్రావెల్ రోడ్లను మరియు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు 13 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సి.సి రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించి పనులకు సంబంధించిన శిలాఫలకాల్ని ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో హిందూ స్మశాన వాటికలో బోర్ వెల్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ ఈ 9నెలల్లో ఉంగుటూరు నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అందించడంతోపాటు ప్రతి గ్రామంలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాటంతో ప్రజలంతా ప్రభుత్వంపై సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వీర మహిళలు, తెలుగు మహిళలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment