ఉంగుటూరు, కొన్ని నెలల క్రితం రాష్ట్రంలో పల్లె పండుగ కార్యక్రమం ద్వారా శ్రీకారం చుట్టిన అభివృద్ధి పనులు నేడు కార్యరూపం దాల్చటంతో నిజంగానే పల్లె ప్రాంతల్లో నేడు పండుగ వాతావరణం కనిపిస్తుందని ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. శనివారం గణపవరం మండలం కాశిపాడు గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు 9 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సి.సి రోడ్డును ఉంగుటూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకార సమన్వయంతో అనేక అభివృద్ధి పనులను పూర్తి చెయ్యటం జరిగిందని, దీనిలో భాగంగా రాష్ట్రానికి జీవనాధారలైన పోలవరం, అమరావతి పనులు శరవేగంగా జరుగుతుండటమే కాకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపటం, పెట్టుబడులను తీసుకురావటం, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి పెద్ద పీఠ వెయ్యటం వంటివి నిదర్శనమని తెలిపారు.ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు ఎన్.డి.ఏ కూటమి ప్రభుత్వంపై మరింత నమ్మకం పెరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ మండల అధ్యక్షులు, గ్రామా అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వీర మహిళలు, తెలుగు మహిళలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment