ఎమ్మెల్యేకు ఒక్క క్షణం కూడా పదవిలో కొనసాగే నైతికత లేదు: శేషుబాబు

  • అవనిగడ్డ మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఘననివాళి

అవనిగడ్డ, భారత స్వాతంత్య్రం కోసం పోరాటం చేసి 24 సంవత్సరాలకె వీర మరణం పొందిన యూత్ వింగ్ భగత్ సింగ్ గారి 115వ జయంతి సందర్భంగా వారికి అవనిగడ్డ మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు ఆర్పించడం జరిగింది. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో అవనిగడ్డ నియోజకవర్గ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించలేని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుకు ఆ పదవిలో కొనసాగే నైతికత ఎంత మాత్రం లేదని జనసేన పార్టీ పేర్కొంది. మంగళవారం అవనిగడ్డ జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నేత గుడివాక శేషుబాబు మాట్లాడుతూ సెప్టెంబర్ నెల ముగుస్తున్నప్పటికీ అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు మండలంలో వందలాది ఎకరాలు సాగునీరు అందక ఇప్పటి వరకు నారు మడులు కూడా సిద్దం చేసుకోలేక పోతే మంగళవారం నియోజకవర్గ పర్యటనకు వచ్చిన నీటిపారుదల శాఖ మంత్రికి ఇక్కడి రైతుల సమస్యలు చెప్పి వాటిని పరిష్కరించలేని దుస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, గడిచిన మూడేళ్లలో కోడూరు మండలం బసవవానిపాలెం రైతులు స్వచ్ఛందంగా క్రాప్ హాలిడే ప్రకటించడానికి నైతిక బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మేము అధికారంలోకి వస్తే అవుట్ ఫాల్ స్లూయిజ్ గేట్లు పునర్నిర్మాణం చేస్తామని గొప్పలు చెప్పుకుని, నేడు భారీ నీటిపారుదల శాఖా మంత్రి కోడూరు వస్తే కనీసం ఆయనను అక్కడికి తీసుకుని వెళ్లే ప్రయత్నం కూడా చేయకపోవడం మీ పని తనానికి నిదర్శనం అని అన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో వైరల్ జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉందని, అయినా ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ సరైన రక్తపరీక్షలు అందుబాటులో లేకపోవటంతో ప్రజలు ఇళ్లు, ఒళ్లు గుల్ల చేసుకొని ప్రైవేట్ హాస్పిటల్స్ చుట్టూ తిరిగే దుస్థితి ఏర్పడిందన్నారు. పంచాయతీల్లో నిధులు ఉండాలని, కానీ ప్రభుత్వం పంచాయతీలకు వచ్చే ఆర్థిక సంఘం నిధులను దొడ్డిదారిన తమ ఖాతాలో వేసుకోవటంతో నేడు గ్రామాల్లో కనీసం దోమల మందు కూడా పిచికారి చేయలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఇన్చార్జి పాలనలో నడుస్తున్నాయని, ఆరు మండలాలకు గానూ ఐదు మండలాల్లో ఎంపిడివోలు, హౌసింగ్ ఏఈ లు లేని పరిస్థితికి ఎవరి వ్యవహారశైలి కారణమని జనసేన నేతలు ప్రశ్నించారు.

అంబటి వ్యాఖ్యలపై ఆగ్రహం

అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రపై అవనిగడ్డ నియోజకవర్గ పర్యటనలో ఉన్న మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ మండిపడింది. ఒళ్లు బలిసిన వారు పాదయాత్ర చేస్తున్నారని అంబటి రాంబాబు మాట్లాడటం సిగ్గు చేటని, ఒళ్లు బలిసి ఎవరు కొట్టుకుంటున్నారో, ఎవరు సామాజిక మాధ్యమాల్లోనూ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒళ్లు బలిసి మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని జనసేన నేతలు అన్నారు. అమరావతి రైతులు తమకు తరాలుగా వస్తున్న భూమిని రాజధాని కోసం త్యాగం చేస్తే, వారికి కనీస గౌరవం ఇవ్వకపోగా, వారిని అవమానించేలా మాట్లాడటం దుర్మార్గమని ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాక శేషుబాబు, ఎంపిటిసిలు బొప్పన భాను, కటికల వసంత్ కుమార్, వార్డు సభ్యులు మునిపల్లి శ్రీ లక్ష్మి, మత్తి శివపార్వతి లు, అశ్వారావు పాలెం గ్రామ ఉప సర్పంచ్ యక్కటి నాగరాజు, బచ్చు వెంకట నారాయణ, బండే నాగ మల్లీశ్వరి, జనసైనికులు గుగ్గిలం అనిల్ కుమార్, అప్పికట్ల శ్రీ భాస్కర్, బచ్చు శ్రీహరి, బొప్పన పృథ్వీ, కోసూరు అవినాష్, తుంగల నరేష్, కమ్మిలి వేణు, రేపల్లె రోహిత్, పప్పుశెట్టి శ్రీను,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.