*యువతకు ప్రేరణగా మహానుభావుని జీవితం
ఏకలవ్యుడి జయంతిని పురస్కరించుకొని ఆదివారం కోనసీమ జిల్లా అంబాజీపేట బస్టాండ్ సెంటర్ మరియు పి.గన్నవరం మండలంలోని డొక్కా సీతమ్మ అక్విడిక్ వద్ద నిర్వహించిన ఏకలవ్య జయంతి వేడుకల్లో కార్యక్రమాల్లో పి.గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు, యువత, సంఘాల ప్రతినిధులు పాల్గొన్న ఈ వేడుకల్లో ఎమ్మెల్యే ఏకలవ్యుడి చిత్రపటానికి పుష్పార్చన చేసి, కేక్ కట్ చేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఏకలవ్యుడు తన నిరంతర శ్రమ, అంకితభావం, గురుపట్ల గల గౌరవంతో మహాత్ముడిగా ఎదిగారని, ఆయన త్యాగ జీవితం ప్రతి యువతకు ప్రేరణగా నిలవాలని అన్నారు. సామాజిక సమానత్వాన్ని వక్రించకుండా నిలిపే దిశగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు ఏకలవ్యుడి త్యాగమూర్తి జీవితం అనుసరణీయమని గుర్తుచేశారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతుల ప్రతిభను వెలికితీయడంపై తీసుకుంటున్న చర్యలను వివరించిన ఆయన, విద్యను ఆయుధంగా భావించి ప్రతి యువకుడు ముందుకు సాగాలన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, ఏకలవ్య సంఘ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Share this content:
Post Comment