డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం మరియు అంబాజీపేట మండలనికి చెందిన యువ క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో గొప్ప విజయాన్ని అందుకున్నారు. ఇటీవల కర్నూలు జిల్లా తాడిపత్రి గ్రామంలో నిర్వహించిన టైక్వాండో క్రీడల్లో పి.గన్నవరం మరియు అంబాజీపేట మండలాలకు చెందిన 15 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన ఆరుగురు విద్యార్థులు త్వరలో హరిద్వార్లో జరగబోయే నేషనల్ టైక్వాండో పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తన క్యాంపు కార్యాలయంలో ఈ విద్యార్థులను ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. మన రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించడమే కాకుండా, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలోనూ ఎప్పుడూ ముందుంటుందని ఆయన తెలిపారు. యువ క్రీడాకారుల విజయానికి ఇది ఒక మంచి ప్రేరణగా నిలుస్తుందని, గ్రామీణ ప్రాంతాల నుంచే ప్రతిభావంతులు ఎందరో వెలుగులోకి రావచ్చని ఎమ్మెల్యే ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ గౌరవం యువ క్రీడాకారుల కృషికి ప్రతిఫలంగా నిలిచింది. మన మండలాల నుండి నేషనల్ స్థాయికి చేరారు అంటే అది మనమందరికి గర్వకారణం. ఇలాంటి యువతను మరింత ప్రోత్సహించి వారి విజేతల బాటలో మనమంతా తోడుండాలి.
Share this content:
Post Comment