అడపా దుర్గా ప్రసాద్ కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన ఎమ్మెల్యే గిడ్డి

పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభకు హాజరై తిరిగి వచ్చిన ఈదరపల్లి గ్రామానికి చెందిన జనసైనికుడు అడపా దుర్గా ప్రసాద్ గుండెపోటుతో మరణించడం గుండెను కలచివేసింది. ఈ విషాదకర ఘటనపై, పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, దుర్గా ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆర్థిక సహాయంగా రెండు లక్షల రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మామిడికుదురు మండల అధ్యక్షులు జె.ఎస్.ఆర్, నియోజకవర్గ సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షులు అడబాల తాతకాపు, పెదపట్నం లంక ఎంపీటీసీ కొమ్ముల జంగమయ్య, పాసర్లపూడి సొసైటీ అధ్యక్షులు మంద గాంధీ, అయినవిల్లి మండల అధ్యక్షులు పోలిశెట్టి రాజేష్, మామిడికుదురు మండల యూత్ అధ్యక్షులు బల్ల సతీష్ పాల్గొన్నారు.

Share this content:

Post Comment