పి.గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ శనివారం ఆదుర్రు గ్రామంలోని చారిత్రక బౌద్ధ క్షేత్రాన్ని – బోధి స్తూపాన్ని సందర్శించారు. శాతవాహనుల కాలానికి చెందిన ఈ స్తూపం బౌద్ధ ధర్మ పూర్వ వైభవాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రదేశం అపోహకు గురైందని వ్యాఖ్యానించారు. బౌద్ధ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, పురావస్తు శాఖతో కలిసి తవ్వకాలు, పునరుద్ధరణ కార్యక్రమాలు చేపడతామన్నారు. విజ్ఞాన కేంద్రం, ధ్యాన వేదికలు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులకు జ్ఞానాన్ని, స్థానికులకు ఉపాధిని కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కోనసీమ గర్వంగా నిలిచేలా ఈ చారిత్రక స్తూపాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక గ్రామస్థులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment