పాలకొండ, వీరఘట్టం మండలం వీరఘట్టం పట్టణం కస్పా వీధికి సంబంధించిన దూసి సుదర్శన్ వెంకయ్య వారికి తీవ్రమైన కిడ్నీ వ్యాధితో బాధపడుతూ, కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయుచుకున్నందున, మరియు శ్రీమతి దూసి బిందు సుదర్శన్ వారి భర్త అయిన దూసి సుదర్శన్ వెంకయ్యకి కిడ్నీ దానమిచ్చినందుకు జరిగిన వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుండి, దూసి సుదర్శన్ వెంకయ్య వారికి రూ.2,56,000/- మరియు వారి భార్య శ్రీమతి దూసి బిందు సుదర్శన్ వారికి రూ.1,71,697/- ల రూపాయిలు పాలకొండ నియోజకవర్గం ఎన్.డి.ఏ కూటమి జనసేన శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ మంజూరు చేయించియున్నారు. సదరు చెక్కులు వారి ఇరువురికి శాసనసభ్యులు శనివారం రాజపురం క్యాంప్ కార్యాలయంలో చెక్కులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరఘట్టం మండల టీడీపీ నాయకులు, వీరఘట్టం పట్టణ టీడీపీ నాయకులు మరియు ప్రజలు పాల్గొన్నారు.
Share this content:
Post Comment