ఉచిత కుట్టు శిక్షణ ప్రారంభించిన ఎమ్మెల్యే నాయకర్

నరసాపురం పట్టణంలోని 1వ వార్డు శ్రీహరిపేట, మొగల్తూరు మరియు సీతారాంపురంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థల (ఈ. డబ్ల్యు.ఎస్) సహకారంతో ఉచిత కుట్టు శిక్షణ (టైలరింగ్) కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రభుత్వ విప్ మరియు నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్. ఈ శిక్షణ ద్వారా మహిళలకు స్వావలంబన సాధించేందుకు అవసరమైన నైపుణ్యాలు అందుబాటులోకి రానున్నాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడ్డ మహిళలకు ఈ శిక్షణ ఉపయుక్తంగా మారుతుందని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల సద్వినియోగంతో మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలని ఎమ్మెల్యే నాయకర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు కోటిపల్లి వెంకటేశ్వరరావు, బందెల రవీంద్ర, పిల్లా శ్రీహరి, ఇంటి మురళి, వట్టిప్రోలు సతీష్, కుసుమ కిరణ్ , గన్నాబత్తుల దుర్గాప్రసాద్, అధికారులు, జనసేన, టిడిపి, బిజెపి నాయకులు, జనసైనికులు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share this content:

Post Comment