పిఠాపురం, చిత్రాడలో జరుగుతున్న జయకేతనం భారీ బహిరంగ సభకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయం నుండి బస్సులు, కార్లు, మోటర్ సైకిళ్లతో భారీ ర్యాలీగా జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పిఠాపురం బయలుదేరారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభమైందని, ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన కట్టుబడి ఉందని తెలియజేశారు. జయకేతనం సభ ద్వారా జనసేన ముఖ్య లక్ష్యాలు, ప్రజల కోసం చేపట్టే కార్యక్రమాలు ప్రజలకు చేరువవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న జనసైనికులు, వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంపై తమ నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, జనసేన విజయానికి తాము అంకితభావంతో కృషి చేస్తామని తెలిపారు.
Share this content:
Post Comment