ఆవిర్భావ సభ పోస్టర్స్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ

మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, జనసేన శాసన సభ్యులు నిమ్మక జయకృష్ణ సమక్షంలో, వీరఘట్టం మండలం జనసేన టీమ్ ఆధ్వర్యంలో “ఛలో పిఠాపురం” జనసేన ఆవిర్భావ సభ పోస్టర్స్ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ చేతులు మీదగా విడుదల చేశారు. ఈ సందర్భంగా, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ అంగరంగ వైభవోపేతంగా జరుపుకుంటున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని కలిసికట్టుగా అత్యంత విజయవంతంగా జరిపేలా ప్లాన్ చేద్దామని పిలుపునిచ్చారు. పాలకొండ నియోజకవర్గం జనసేన శ్రేణులకు ఆయన అభిలాషించారు. ఈ నెల 14వ తేదీన పిఠాపురం, చిత్రాడలో జరగబోయే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ విజయోత్సవ సభను విజయవంతంగా నిర్వహించేందుకు, పాలకొండ నియోజకవర్గ ముఖ్య నాయకులు, మండల అధ్యక్షులు, పట్టణ నాయకులు, గ్రామ నాయుకులు, జనసైనికులు, వీరమహిళలు ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదల పవన్ కళ్యాణ్ పేరు ప్రపంచవ్యాప్తంగా చర్చించుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని, నియోజకవర్గం జనసేన కుటుంబ సభ్యుల‌కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి జనసేన జానీ, క్రీయాశీలక వాలంటీర్ మత్స పుండరికం, టౌన్ నాయుకులు కర్నేన సాయి పవన్, ఉదయాన చరణ్, సిరాపు నాగరాజు, పుప్పాల పురుషోత్తం, దత్తి గోపాల్ మెడిద సందీప్, బొమ్మాలి వినోద్, రౌతు నవీన్, రాజాపు కుమార్, నిడగంటి ఉమా, పాలక వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment