ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా దోనుభాయి ఆశ్రమ పాఠశాలలో మృతి చెందిన గిరిజన విద్యార్థి చలపతి కుటుంబ సభ్యులను పరామర్శించిన పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, విద్యార్థి ఆకస్మిక మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇస్తూ, తక్షణ అవసరాల కోసం చలపతి తల్లికి ₹10,000 అందజేశారు. మృతదేహాన్ని కుటుంబసభ్యులకు త్వరగా అప్పగించేందుకు అధికారులతో, ఆసుపత్రి సూపరింటెండెంట్ గొర్రిల నాగభూషణ్, హాస్పిటల్ సిబ్బందితో చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ ప్రతినిధి బొమ్మలి సుధాకర్ రావు, కూటమి యువనేత జాడ శ్రీధర్, ఎంపీటీసీ ప్రతినిధి మజ్జి నవీన్, జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి జానీ, భామిని, సీతంపేట కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment