టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ

మన్యం జిల్లా జనసేన శాసన సభ్యులు నిమ్మక జయకృష్ణ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ విజేతగా నిలిచిన టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపారు. న్యూజిలాండ్ జట్టు చివరి వరకు పోరాడిన విధానం ఎంతో ఆకట్టుకున్నది. టీమ్‌ను ముందు నుంచి నడిపించిన రోహిత్ శర్మ, వెనుకుండి వారిని సమర్థంగా మార్గనిర్దేశం చేసిన కోచ్ గౌతమ్ గంభీర్, మరియు ప్రతి ప్లేయర్ తన బాధ్యతను చక్కగా నిర్వర్తించడం వల్ల టీమ్ విజయవంతంగా ప్రయాణించి ఈ ట్రోఫీని గెలిచింది. 140 కోట్ల భారతీయులు ఈ ఘన విజయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసారు. ఈ గెలుపు, దుబాయిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీని మూడవసారి భారత్ గెలిచిన సందర్బంగా దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నారు.. ఈ విజయాన్ని సాధించడంలో టీమ్ ఇండియా కీలక పాత్ర పోషించిందని, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పాలకొండ నియోజకవర్గం తరఫున అభినందనలు తెలిపారు.

Share this content:

Post Comment