నీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టిన ఎమ్మెల్యే పంతం నానాజీ

కాకినాడ జిల్లా, కాకినాడ రూరల్ నియోజకవర్గం, కాకినాడ రూరల్ మండలం, ఇంద్రపాలెం గ్రామంలో తాగునీటి కోసం అగచాట్లు పడిన ఇంద్రపాలెం గ్రామంలో పరిష్కారం లభించిందని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ముందుగా జనసేన పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరి కాయ కొట్టి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జనసేనపార్టీ కాకినాడ రూరల్ మండల ఉపాధ్యక్షులు గరవ శ్రీరాములు, ఇంద్రపాలెం గ్రామ అధ్యక్షులు దొడ్డిపట్ల, అప్పారావు, సీనియర్ నాయకులు సూతి శ్రీనివాస్, తాటిమళ్ళ రమేష్ మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వ హయంలో పంచాయితీ నిధులు దుర్వినియోగం చేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు పవన్ కళ్యాణ్ చొరవతో పంచాయతీలు అభివృద్ధి చెందుతాయని, గ్రామ అభివృద్ధే ద్యేయంగా సంకల్పంతో అభివృద్ధి చెయ్యడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని వివరణ ఇచ్చారు. అలాగే గత వైసిపి హయంలో గ్రామ ప్రజలు గుక్కెడు నీరు దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందనీ, ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు ఇంద్రపాలెం గ్రామ ప్రజలకు ట్యాంకర్ల ద్వారా సురక్ష మున్సిపాలిటీ నీరు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీకి ఇంద్రపాలెం గ్రామ ప్రజల తరఫున కూటమి పార్టీ నాయకుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధికి అడుగులు వేస్తూ పాలనలో ముందుకు సాగుతుందన్నారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడడమే, కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యం అని, ఇంద్రపాలెం గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే పంతం నానాజీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ శ్రేణులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment