నీటి సమస్యకు ముగింపు చెప్పిన ఎమ్మెల్యే – ముంగండలో మైక్రో ఫిల్టర్ ప్లాంట్ ప్రారంభం

పిగన్నవరం, ముంగండ గ్రామంలో రూ. 25 లక్షలతో నిర్మించిన మైక్రో వాటర్ ఫిల్టర్ ప్లాంట్‌ను పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గురువారం ప్రారంభించారు. ఇది ఒక గ్రామం కోసం కాదు, చుట్టుపక్కల పది గ్రామాల ప్రజల నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం. చాలా ఏళ్లుగా తాగునీటి సమస్యతో బాధపడుతున్న గ్రామాలకు ఇప్పుడు ఊపిరిపీల్చుకునే అవకాశం వచ్చింది. ఇది పూర్తిగా ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే చొరవతో జరిగిన అభివృద్ధి పని. ప్రభుత్వ వనరులను సరైన దిశలో వినియోగించి, నిజమైన అవసరాలను గుర్తించి చేసిన పనికి పలువురు అభినందిస్తున్నారు. ఇలానే ప్రతి గ్రామానికి అభివృద్ధి కట్టబెడుతూ ముందుకు సాగుతున్న గిడ్డి సత్యనారాయణ కి స్థానిక ప్రజలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.

Share this content:

Post Comment