రానున్న ఎండాకాలంను ద్రుష్టిలో ఉంచుకొని 30వ వార్డు ప్రజలకు నీటి సమస్య లేకుండా ఉండాలని మదనపల్లి శాసనసభ్యులు ప్రశాంత నగర్ లో బోర్ వేయించడం ప్రారంభించమని ఆదేశించారు. ఈ బోరు వేయడం వలన సప్తగిరి నగర్, ప్రశాంత నగర్, రెడ్డిస్ కాలనీ వాసులకు నీటి కొరత లేకుండా నీటి సరఫరా చేయవచ్చు. అందుకు గాను సోమవారం ఉదయం సప్తగిరి నగర్ మెయిన్ రోడ్ నందు “ఎమ్మెల్యే ఆదేశాలమేరకు పూజా చేసిన బోరు వేయడం ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన రీజినల్ కో ఆర్డినేటర్ దారం అనిత, సుబ్బరాజు, తెలుగు దేశం పార్టీ 30వ వార్డ్ ఇంచార్జి దుబ్బిగాళ్ల భాస్కర్, మైనారిటీ టౌన్ నాయకులు కూర్పల్లి మస్తాన్, నాగినేని రవి చంద్ర నాయుడు, గౌస్ అజాం గార్లు పర్యవేంక్షించారు.
Share this content:
Post Comment