ఎమ్మెల్యే వనామా స్పందించి పరిష్కారం చూపించాలి: వేముల కార్తిక్

కొత్తగూడెం నియోజకవర్గం కరకవాగు ప్రాంతంలో 17వ వార్డ్ లో సైడ్ కాల్వలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోని మున్సిపాలిటీ వాళ్ళు, పక్కనే కెటిపిఎస్ కి సంబంధించిన వాటర్ వెళ్తుండటంతో మాకు సంబంధం లేదు అని మున్సిపాలిటీ వాళ్ళు, కెటిపిఎస్ వాళ్ళు వేయించాలి అని అంటున్నారు. కెటిపిఎస్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వేయించాలి అని గత కొన్ని ఇయర్స్ గా కరకవాగు 17 వ వార్డ్ ప్రజలని ఇబ్బంది పెడుతున్నారు. తక్షణమే ఈ సమస్య మీద ఎమ్మెల్యే వనామా స్పందించి పరిష్కారం చూపించాల్సిందిగా జనసేన పార్టీ తరుపున కోరుతున్నామని జనసేన పార్టీ కొత్తగూడెం నియోజకవర్గం కోఆర్డినేటర్ వేముల కార్తిక్ తెలిపారు.