నరసాపురంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

నరసాపురం, కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి, పేరాబత్తుల రాజశేఖరం ను గెలిపించాలని కోరుతూ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, బుధవారం ప్రభుత్వ విప్ మరియు నరసాపురం నియోజకవర్గ శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, తెలుగుదేశం పార్టీ నర్సాపురం నియోజకవర్గం ఇంచార్జ్ పొత్తూరి రామరాజు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా బుధవారం నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలంలోని రామన్నపాలెం మరియు మొగల్తూరు పంచాయతీలో పలుచోట్ల ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్స్ ని కలిసి, కరపత్రాలను పంపిణీ చేసి, మీ 1 వ ప్రాధాన్యత ఓటు పేరాబత్తుల రాజశేఖరంకు వేసి గెలిపించవలసిందిగా ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కొల్లాటి గోపికృష్ణ, గుబ్బల నాగరాజు, జక్కం శ్రీమన్నారాయణ, నిప్పులేటి తారక రామారావు, పిప్పాల రామకృష్ణ, దాసరి కృష్ణాజీ, లాక్కు బాబీ, మేక ఆజాద్, పిప్పల సత్య, దుసనపూడి సత్యనారాయణ, ముక్కు గిరి, వాతడి దుర్గరాజు, కొండేటి తాతాజీ, ముక్కు పుల్లయ్య, కొప్పడ నాగరాజు, బొల్ల చంటి మరియు జనసేన-టిడిపి-బిజెపి నాయకులు జనసైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment