నరసాపురం, కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి, పేరాబత్తుల రాజశేఖరంను గెలిపించాలని కోరుతూ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, ఆదివారం ప్రభుత్వ విప్ మరియు నరసాపురం నియోజకవర్గ శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సలహాదారులు, మాజీ శాసనమండలి చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ , జిల్లా జనసేన పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్ చెనమల్ల చంద్రశేఖర్, తెలుగుదేశం పార్టీ నరసాపురం నియోజకవర్గం ఇంచార్జ్ పొత్తూరి రామరాజు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆదివారం నరసాపురం నియోజకవర్గంలోని నరసాపురం పట్టణంలో 18, 19, 23వ వార్డులలో పలుచోట్ల ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్స్ ని కలిసి, కరపత్రాలను పంపిణీ చేసి, మీ 1వ ప్రాధాన్యత ఓటు పేరాబత్తుల రాజశేఖరంకు వేసి గెలిపించవలసిందిగా ఓటర్లను కోరి అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జనసేన-టిడిపి పట్టణ అధ్యక్షులు కోటిపల్లి వెంకటేశ్వరరావు, జక్కం శ్రీమన్నారాయణ, వలవల నాని , శంకు భాస్కర్ నాయుడు, పోలిశెట్టి నళిని, దొండపటి స్వాములు, మల్లాడి మూర్తి, చక్రవర్తి, గ్రంధి నాని, దేవరపు సుబ్బారావు, అడ్డాల శ్రీను మరియు జనసేన-టిడిపి-బిజెపి నాయకులు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment