పాలకొండ, వీరఘట్టం మండల కేంద్రంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్, నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆదేశాలు మేరకు అధ్యక్షులు ఉదయాన ఉదయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎన్నిక సందర్బంగా కూటమి బలపరిచిన అభ్యర్థి పాకాలపాటి రఘు వర్మకి మద్దతుగా ప్రతి స్కూల్ కి, కాలేజీకీ వెళ్లి ప్రచారం చెయ్యడం జరిగింది. గతంలో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఏవిదంగా ప్రతి ఓటర్ దగ్గరకు వెళ్లి పరిస్థితులు చెప్పి కస్టపడి గెలిపించామో, ఇప్పుడు కూడా కూటమి అభ్యర్థి గెలిపించే బాధ్యత మనకుందని మీటింగ్ లో నాయకులు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మాజీ తోటపల్లి ప్రాజెక్ట్ చైర్మన్ నిమ్మక పాండురంగ రావు, మాజీ ఏ.ఎం.సి చైర్మన్ పొదిలపు కృష్ణ మూర్తి నాయుడు, టీడీపీ అరకు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పొన్నాడ నాగేశ్వర రావు, పట్టణ అధ్యక్షులు జామి లక్ష్మీనారాయణ, నీటి సంఘం అధ్యక్షులు చింత ఉమా మహేశ్వర రావు, మాజీ నీటి సంఘం అధ్యక్షులు బల్ల హరి, గొర్లె గౌరీ నాయుడు, మండల ఎస్సీ సెల్ లింగాల చంటి, నాయిని బ్రాహ్మణ అధ్యక్షులు దళ్ళవలస శ్రీనివాస, కర్రీ జగదీశ్, సత్యం నాయుడు, కుమార స్వామి, రామకృష్ణ (కెళ్ల) కొంచాడ రామకృష్ణ, శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి జనసేన జానీ, జనసేన క్రీయశీలక వాలంటీర్ మత్స పుండరికం, సరిపల్లి అచ్యుత రావు, ఉదయాన చరణ్, కర్నెన సాయి పవన్ మరియు వివిధ గ్రామాల కూటమి నాయకులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment