రంపచోడవరం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

రంపచోడవరం నియోజకవర్గం, ఎమ్మెల్యే శ్రీమతి మిరియాల శిరీష దేవి విజయ భాస్కర్ ఆదేశాల మేరకు శనివారం అడ్డతీగల, వేటమామిడి, నిమ్మలపాలెం, మల్లవరం మామిళ్ళు, డి భీమవరం గ్రామాలలో కూటమి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంని గెలిపించాలని ఒకటో 1 నెంబర్ ప్రాధాన్యత ఓటు వెయ్యాలని కూటమి నాయకులు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడ్డతీగల మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బూర్లే హరిబాబు, ఎడ్ల శ్రీనివాస్, బాలయోగి, ఆనందరావు, సడేల శీను, ఎంపీటీసీ లావరాజు, రాజు, సత్తిబాబుఅడ్డతీగల మండలం జనసేన పార్టీ నాయకులు కుప్పాల జయరాం, పొడుగు సాయి, అప్పాజీ, వెంకటేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment