తాడేపల్లిగూడెం, తూర్పు పశ్చిమగోదావరి జిల్లాల కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపును కాంక్షిస్తూ తాడేపల్లిగూడెం పట్టణంలో స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇంచార్జ్ వలవల బాబ్జీ, బిజెపి ఇంచార్జ్ ఈతకోట తాతాజీలు కలసి ప్రచారం చేసారు. అందులో భాగంగా మంగళవారం ఉదయం వారు పట్టభద్రుల అభ్యర్థి రాజశేఖరం గెలుపుకు మద్దతుగా తాడేపల్లిగూడెం పట్టణంలోని వివిధ ప్రైవేట్ బ్యాంకులు ఉద్యోగులు, ఎఫ్.సి.ఐ గోడౌన్స్ ఉద్యోగులు, పోస్ట్ ఆఫీస్, ఎల్ఐసి ఆఫీసులో పనిచేసే ఉద్యోగుల దగ్గరకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తుందన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం వల్ల అమరావతికి, పోలవరానికి అవసరమైన నిధులను తెచ్చుకోవడం జరుగుతుందని తెలిపారు. గత సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించినట్లుగానే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా కూటమి తరపున పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అడబాల నారాయణమూర్తి, వర్తనపల్లి కాశి, మైలవరపు రాజేంద్రప్రసాద్, యంత్రపాటి రాజు, మద్దాల మణికుమార్, పైబోయిన వెంకటరామయ్య,అడబాల మురళి, చాపల రమేష్, నీలపాల దినేష్, బైనపాలేపు ముఖేష్, గట్టిమ్ నాని, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, అనిల్, శ్రీను, సండక రమణ, దస్తగిరి, కటికిరెడ్డి కళ్యాణి, తెలుగుదేశం నాయకులు పట్నాల రాంపండు, వాడపల్లి వెంకట సుబ్బరాజు, ఎరుబండి సతీష్, పాతూరి రాంప్రసాద్ చౌదరి, దాట్ల జగన్నాథరాజు, లీల, నక్క చిట్టిబాబు, బిజెపి నాయకులు దువ్వ శ్రీను, రామగాని సత్యనారాయణ, పడాల కావ్యరెడ్డి, బెనర్జీ, గంగాధర్ రావ్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment