ఎమ్మెల్సీ ఎన్నికలు: కొనసాగుతున్న కౌంటింగ్…

తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మార్చి 14 వ తేదీన హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్, నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ మార్చి 17 వ తేదీన ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతోంది. నల్గొండ -ఖమ్మం-వరంగల్ కు సంబంధించిన కౌంటింగ్ విషయానికి వస్తే, ప్రస్తుతం మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో టిఆర్ఎస్ అభ్యర్థి పల్లా 1,10,840 ఓట్లు సాధించగా, తీన్మార్ మల్లన్న 83,290 ఓట్లు సాధించారు. ప్రొఫెసర్ కోదండరాం 70,072 ఓట్లు సాధించగా, బీజేపీ అభ్యర్థి 39,107 ఓట్లు సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తరువాత టిఆర్ఎస్ అభ్యర్థి పల్లా తన సమీప అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై 27,550 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ 51శాతం మెజారిటీ రాకపోవడంతో రెండో ప్రాధ్యానత ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. ఈరోజు రాత్రి వరకు ఫలితం వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు.