‘ఏజెంట్’ కీలక పాత్రలో మోహన్ లాల్!

అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమాతో పలకరించబోతున్న విషయం తెలిసిందే. అఖిల్‌కి జోడీగా సాక్షి వైద్య నటిస్తోంది. ఈ సినిమాలో అఖిల్ జేమ్స్ బాండ్ తరహా స్పై క్యారెక్టర్‌లో కనిపించున్నాడని తెలుస్తోంది. దీనికోసం అఖిల్ తన గెటప్‌ని పూర్తిగా మార్చేశారు. వక్కంతం వంశీ కథ అందించిన ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర, సరెండర్ 2 సినిమా బ్యానర్‌పై సురేందర్ రెడ్డి నిర్మించనున్నారు. ఇదిలావుంటే, ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌ని సంప్రదించినట్టు తెలుస్తోంది. బలమైన ఆ పాత్రకి మోహన్‌లాల్‌ అయితేనే బాగుంటుందని చిత్రబృందం భావిస్తోందట. దర్శకుడు సురేందర్ రెడ్డి, స్టార్ నటుడు మోహన్ లాల్ రాకతో అఖిల్ హిట్ సాధిస్తాడేమో చూడాలి. ఈ ఏడాదే డిసెంబర్ 24న ఏజెంట్ మూవీని విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ఇటివలే పోస్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం అఖిల్ నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా జూన్ 19న విడుదల కానుంది.