వరంగల్‌ కోటలో మొహర్రం వేడుకలు

వరంగల్‌ కోటలో జరిగిన మొహర్రం వేడుకలకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహర్రంను హిందూ, ముస్లింలు ఆదివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లావ్యాప్తంగా ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఊరూరా పీరీలను దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. తొమ్మి ది రోజులపాటు పీరీలకు ప్రత్యేక ప్రార్థ్ధనలు చేసి పదో రోజు రాత్రి దగ్గరలో ఉన్న చెరువులు, బావుల్లో నిమజ్జనం చేశారు. మధ్యకోట సదర్‌చౌక్‌ నుంచి హుస్సేనీఆలం, హస్సేనీఆలం, పంజతన్‌, బర్హా ఇమామ్‌ పీరీలతో పాటు మరో నాలుగు పీరీలను దర్శించుకునేందుకు వేలాదిగా తరలివచ్చారు.