ఆంధ్రప్రదేశ్ రోడ్లకు మోక్షం ఎప్పుడో

పలాస, జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా పలాస నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితిపై శనివారం డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. మందస మండలంలోని సువర్ణపురం, పెద్ద కేశవరం, అల్లిమెరక, హరిపురం నుండి పలాస వెల్లె రహదారులు పరిశీలించడం జరిగింది. పలాస నియోజకవర్గంలో ఎక్కడ చూసినా రోడ్లంతా గుంతలమయం, రోడ్లపైన సామాన్యుల ప్రయాణించడానికి భయపడుతున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మజ్జి భాస్కరరావు మాట్లాడుతూ 2021 నవంబర్ కి రోడ్ల మరమ్మతులు చేపడతామని చెప్పిన వైయస్ జగన్మోహన్ రెడ్డి 2023 నవంబర్ కి ఒక్క కూడా ఒక్క రోడ్డును కూడా బాగు చేయలేకపోయారు. గాలిలో తిరిగే ముఖ్యమంత్రికి రోడ్లపైన నడిచే సామాన్యుల యొక్క బాధలు పట్టడం లేదని, మంత్రులు ప్రతిపక్షలపై విమర్శలు చెయ్యడం, భూతులు మాట్లాడడం తప్పితే ఎవరరిది ఏ శాకో తెలియని పరిస్థితి, మరో నాలుగు నెలల్లో ఇప్పుడున్న ప్రభుత్వం కూలిపోయి, ప్రజా ప్రభుత్వమైన జనసేన టిడిపి ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన 6నెలల్లోనే రోడ్లు మరమ్మతులు చేపడతామని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు భావన దుర్యోధన మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా నల్ల బొడ్లూరు కొండ అక్రమ మైనింగ్ చేస్తూ పెద్దపెద్ద వాహనాల వాహనాలలో గ్రావెలు మరియు రాయి లోడ్లు తో లారీలు తిరగడం వలన సువర్ణపురం రోడ్డు పూర్తిగా ధ్వంసం అయ్యింది అని రోడ్లకు కనీస మరమ్మతులు కూడా ఈ వైసీపీ ప్రభుత్వం చేయడం లేదని ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. గత తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మంజూరు చేసిన కొన్ని రోడ్లు మాత్రమే చేయగలిగారు అని మిగతా రోడ్లు అసంపూర్తిగా వదిలేశారు అని తెలిపారు రానున్న ఎన్నికల్లో ఓటు అనే ఆయుధం తో ఈ వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని సైకిల్ గుర్తుపై ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలాస నియోజకవర్గం జనసేన నాయకులు సంతోష్ పండ, అనిల్ కంచరణ, మందస మండలం జనసేన నాయకులు రాపాక కేశవరావు, రౌతు చిరంజీవి, తిరుపతి గౌడ, పందిరి నీలయ్య, వసంత్ బద్రి, కార్తీక్, సాయి, కూర్మారావు, శంకర్, కర్జి పాపారావు, రోకళ్ళ శ్రీను, సాయికిరణ్, ఉదయ్, సోర్ర ఉదయ్, మందస మండలం జనసేన నాయకులు భావన దూర్యోధన, రట్టి లింగరాజు, బామ్మిడి కర్రయ్య, ముండిమాంచి నవీన్, లబ్బ రుద్రయ్య, సిర్ల కృష్ణారావు, కరగాన వాసు, దాసరి శ్రీరాములు, బతకల వెంకట్రావు, కొనారి తులసి రావు, యానాది వాసుదేవరావు, మిస్క మోహన్ రావు, బతకల భాస్కరరావు, జక్కల జోగారావు, నగిరి గోవిందరావు, గుజ్జు తులసయ్య, పందిరి భాస్కరరావు, పందిరి శ్రీను, అడ్డి ఈశ్వరరావు, అందాల గిరి, బర్ల హరికృష్ణ, తలగాన కృష్ణ తదితరులు పాల్గొన్నారు.