ప్రతీ భారతీయుని హృదయం గర్వంతో ఉప్పొంగిన క్షణాలు

  •  గుంటూరు నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్

గుంటూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన ప్రతిష్టాత్మక చంద్రయాన్ – 3 ప్రయోగం విజయవంతం అవటంతో 140 కోట్ల భారతీయుల హృదయాలు గర్వంతో ఉప్పొంగుతున్నాయని జనసేన పార్టీ నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. చంద్రయాన్ – 3 ప్రయోగం విజయవంతం అయిన సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆధ్వర్యంలో శ్రీనివాసరావుతోటలో బాణాసంచా కాల్చుతూ, స్వీట్లు పంపిణీ చేస్తూ విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ జాబిల్లిపై విక్రమ్ లాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ అవటంపై అలుపెరుగని కృషి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు యావత్ దేశ ప్రజలు ఋణపడి ఉంటారన్నారు. చంద్రుని దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారతదేశం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ ప్రయోగం విజయవంతం అవటంతో చంద్రునిపై అడుగుపెట్టిన సోవియట్ రష్యా, అమెరికా, చైనా దేశాల సరసన భారతదేశం చేరటం ఎంతో ఆనందదాయకంగా ఉందన్నారు. రష్యా విఫలమైన చోట భారత్ విజయం సాధించటం భారతీయులందరికీ గర్వకారణమన్నారు. ఎంతో అభివృద్ధి చెందిన దేశాలకు కూడా దక్కని కీర్తిని భారతదేశానికి అందించిన ఘనత ఇస్రో శాస్త్రవేత్తలు దక్కుతుందన్నారు. ఈ ప్రయోగం విజయవంతంతో ప్రపంచ మానవజాతి పురోభివృద్ధి లోనూ, వైజ్ఞానిక రంగంలోనూ గణనీయ మార్పులు రానున్నాయని, వాటికి కేంద్రబిందువుగా భారతదేశం ఉండటం భారతీయులందరికీ గర్వకారణమని నేరేళ్ళ సురేష్ అన్నారు. విజయోత్సవ వేడుకల్లో జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్, నగర కమిటీ సభ్యుల రవీంద్ర, బాషా, రెల్లి యువ నేత సోమి ఉదయ్, యూసఫ్, రామిశెట్టి శ్రీను, కోనేటి ప్రసాద్, కోలా అంజి, రోశయ్య, పీ రమేష్, చిరంజీవి, వడ్డె సుబ్బారావు, అన్వేష్, ఫణి, కుమార స్వామి, నండూరి స్వామి, పులిగడ్డ గోపి, సాయి తదితరులు పాల్గొన్నారు.