ప్రత్తిపాడు నియోజవర్గం, కాకుమాను మండలం, పాండ్రపాడు గ్రామం నుండి కొంతమంది మహిళలు మరియు స్థానిక ప్రజలు ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరిన్ని చేరుకులు ఉంటాయని, ప్రతిపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత బలోపేతం దిశగా అడుగులు వేస్తామని తెలియజేశారు. అలాగే వీరందరూ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నమ్మి, ఉప ముఖ్యమంత్రివర్యులుగా మరియు పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా గ్రామాల పట్ల ఆయన చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధను చూసి పార్టీలో చేరారని అన్నారు. అలాగే పార్టీలో చేరిన ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలని, గతంలో ఉన్న నాయకులు అందరితో కలిసి గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. పార్టీలో చేరిన వారిలో దేవి రెడ్డి వెంకటరతయ్య, దేవి రెడ్డి శివరామకృష్ణ, కోరంగి లక్ష్మీ తిరుపతమ్మ, బొమ్మిశెట్టి సుజాత మరియు తదితరులు ఉన్నారు. వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కి గ్రామాల పట్ల ఉన్న ప్రేమను మరియు గ్రామాలను వారి అభివృద్ధి చేస్తున్న విధానాన్ని చూసి పార్టీలో చేరామని, పార్టీలో నిబద్ధతతో పనిచేసి జనసేన పార్టీని గ్రామంలో తమదానే శారీలో అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చట్టాల త్రినాథ్, కాకుమాను మండల అధ్యక్షులు గడ్డం శ్రీనివాసరావు, కాకుమాను మండల నాయకులు నాగరాజు, పాండ్రపాడు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు తోకల శ్రీనివాసరావు, జనసేన నాయకులు తోట ఫణి మరియు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment